ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Telugu Yuvatha: 'చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యం' - sri ram chinnababu talks about upcoming elections

రాష్ట్రంలో వైకాపా సర్కార్ పాలనపై తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు (sriram chinababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అరాచక పాలనకు వ్యతిరేకంగా యువతను ఏక తాటిపై తెచ్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.

తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు
తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు

By

Published : Jul 4, 2021, 4:52 PM IST

ముఖ్యమంత్రి జగన్ అరాచక పాలనకు వ్యతిరేకంగా యువతను ఒక తాటిపై తెచ్చేందుకు... తెలుగు యువత కృషి చేస్తోందని ఆ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు అన్నారు. భూ దందాలు, ఇసుక దోపిడీ, మైనింగ్ మాఫియా కు వ్యతిరేకంగా పోరాడతామని వెల్లడించారు.

వచ్చే ఎన్నికల్లో తెదేపాను భారీ మెజారిటీతో గెలిపించి, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. 15 లోక్​సభ నియోజకవర్గాలకు కొత్త తెలుగు యువత అధ్యక్ష, కార్యదర్శులను ప్రకటించామని.. మిగిలిన స్థానాలకు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details