ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తెలుగు మనుగడ'పై.. రాష్ట్రేతరుల ఆవేదన! - తెలుగు రచయితల ప్రపంచ తెలుగు మహాసభలు

తెలుగు రచయితల ప్రపంచ మహాసభలు కొనసాగుతున్నాయి.

telugu writers world summit in vijayawada day 3
telugu writers world summit in vijayawada day 3

By

Published : Dec 29, 2019, 12:51 PM IST

విజయవాడ నుంచి తెలుగు వెలుగు ప్రత్యేక ప్రతినిథి:

తెలుగు రచయితల ప్రపంచ మహాసభల మూడో రోజు కార్యక్రమాలు విజయవాడలో కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం గిడుగు రామమూర్తి సాహితి సాంస్కృతిక వేదికపై రాళ్ళపల్లి సుందరరావు సమన్వయ కర్తగా.. రాష్ట్రేతర ప్రతినిధుల సమావేశం జరిగింది. సభన నిర్వహణ కమిటీ గౌరవ అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడారు. " తెలుగు భాషకోసం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మొదట స్పందించేది రాష్ట్రేతర తెలుగువారే. వీళ్లంతా అక్కడ స్థానిక భాషలను మాట్లాడుతూనే... వాళ్ల అమ్మ భాషను కాపాడుకుంటున్నారు... మాతృ భాష కోసం ఆరాటపడుతున్నారు'' అని అన్నారు.

అ‌నంతరం సమన్వయకర్త రాళ్ళపల్లి సుందరరావు మాట్లాడారు. "భాష విషయంలో కొన్ని రాష్ట్రాలు భిన్నంగా ఉంటున్నాయి. భాషకు దూరమైపోతున్నారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఉంటున్న తెలుగువాళ్లు.. అక్కడ తెలుగు మాట్లాడలేని పరిస్థితి నేడు ఉంది. నేను కోరుకున్నదొక్కడే... ఇక్కడి రాజకీయ రాజకీయేతర నాయకులు అప్పుడప్పుడు మా ప్రాంతాల్లో పర్యటించి మా బాగోగులు... మా భాషా స్థితిగతులను పట్టించుకోవాలి'' అని మనవి చేశారు.

బెంగళూరు నుంచి సభలకు హారజైన ఏఎన్​సీవీ రావు తన మనోభావాలు పంచుకున్నారు. భాష మూలాల స్మరణ... సాంకేతిక భాషగా తెలుగుకు ఎదురవుతున్న సవాళ్లను ప్రస్తావించారు. హోసూరు నుంచి వచ్చిన సీతారామయ్య మాట్లాడుతూ... ''తమిళనాడులో నేడు తెలుగు దారుణ పరిస్థితిలో వుంది. తెలుగు మా తల్లి అని ధైర్యంగా చెప్పడానికి లేదు. ఇక ఆంధ్ర లో పరిస్థితి మరీ దయనీయంగా ఉండటం చూస్తే బాధేస్తోంది'' అన్నారు. తమిళనాడు లో కోటి మంది తెలుగు వాళ్లున్నారు. ఒకటో తరగతి నుంచే అక్కడ తెలుగు ఎందుకు చెప్పకూడదని ఆయన ప్రశ్నించారు. తర్వాత హోసూరు నుంచి వచ్చిన మరో అతిథి ఎమ్ ఎస్ రామస్వామి మాట్లాడుతూ... " తెలుగువాళ్లు తెలుగు పత్రికలు చదవడం లేదు. తమిళనాడులోనే కాదు... ఏ రాష్ట్రాల్లో కూడా చదవడం లేదు. కన్నడంలో ఎంతో మందికి జ్ఞానపీఠాలొచ్చాయి. తెలుగులో మూడే వచ్చాయి. ఏంటీ దారుణం! ఏమైపోయిందీ మన పోరాట పటిమ!'' అంటూ ఆవేదన చెందారు.

నాగపూర్ నుంచి వచ్చిన ఎన్ ఎన్ మూర్తి మాట్లాడుతూ... " మహారాష్ట్ర లోని ఉన్న ఐదు ప్రాంతాల్లో తెలుగులో పూర్తి భిన్నంగా ఉంది. విదర్భ లో తెలుగు పాఠశాలే లేదు. ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లోనూ తెలుగును ప్రభుత్వమే దూరం చేయడం దారుణం. ఒరియాలో భాషాపరమైన ఒత్తిడిని ఉపాద్యాయులపై పెడుతున్నారు. బలవంతంగా ఒరియాలో చెప్పిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం అనేది ఒరిస్సా లో ఉన్న తెలుగు వాళ్ల మీద కూడా పడే ప్రమాదం ఉంది'' అని చెప్పారు.

ప్రసాదం హనుమంతరావు బెంగళూరు నుంచి వచ్చారు. "తెలుగు కన్నడ తల్లులు అక్కాచెళ్లెళ్లు. ఇక్కడ భాష గురించి ఏం చెప్పాలో... ఏం చేయాలో తెలీని పరిస్థితి. ఎందుకంటే.... తెలుగు రాష్ట్రమైన ఆంధ్రలో ఆంగ్ల మాధ్యమం తిష్ఠవేసిన తీరు... ఏం మాట్లాడనీయకుండా చేస్తోంది'' అని ఆవేదన చెందారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details