ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మద్యం సీసాలు పగలకొట్టి తెలుగు మహిళల నిరసన - మద్యం సీసాలు పగలకొట్టి తెలుగు మహిళల నిరసన

ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మద్యం విధానంపై తెలుగు మహిళలు భగ్గుమన్నారు. పార్టీ కేంద్ర కార్యలయం ఎన్టీఆర్ భవన్ వద్ద మధ్యం సీసాలు పగలగొట్టి నిరసన తెలిపారు. తక్షణమే నూతన మధ్యం విధానం రద్దు చేయడంతో పాటు రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

మద్యం సీసాలు పగలకొట్టి తెలుగు మహిళల నిరసన
మద్యం సీసాలు పగలకొట్టి తెలుగు మహిళల నిరసన

By

Published : Oct 2, 2021, 9:21 PM IST

ప్రభుత్వ నూతన మద్యం విధానాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు మహిళలు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద నిరసన చేపట్టారు. గాంధీ జయంతి రోజు నూతన మద్యం విధానాన్నిజగన్ రెడ్డి ప్రకటించటం దుర్మార్గమని మండిపడుతూ మద్యం సీసాలు పగలగొట్టారు.

మద్యం సీసాలు పగలకొట్టి తెలుగు మహిళల నిరసన

ప్రతిపక్ష నేతగా మద్యనిషేధ హామీతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి.. మద్యం దుకాణాలు పెంచుకుంటూ పోతున్నారని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీ మేరకు మద్యనిషేధం అమలు చేసి నూతన మద్యం పాలసీని వెనక్కి తీసుకోకుంటే మద్యం దుకాణాలను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, తెలుగు మహిళ అధికార ప్రతినిధులు వేగుంట రాణి, కంభంపాటి శిరీష తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:Telugu Professional Wing: 'తెలుగు ప్రొఫెషనల్ వింగ్' పేరుతో తెదేపా కొత్త అనుబంధ విభాగం

ABOUT THE AUTHOR

...view details