తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. తెలుగు మహిళలు డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. మహిళా నాయకులను డీజీపీ కార్యాలయం బయటే పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బారికేడ్లు అడ్డుపెట్టిన పోలీసులు ..సర్వీస్ రోడ్డును దిగ్భంధించారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం అనంతరం.. ఫిర్యాదు చేసేందుకు ఐదుగురు ప్రతినిధులను కార్యాలయంలో కి అనుమతించారు.
అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.. లేకుంటే..! - Telugu women latest news
తెదేపా నేత వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అధికార పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళలు.. డీజీపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో తెలుగుమహిళలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఫిర్యాదు తీసుకునేందుకే ప్రభుత్వం భయపడుతోందని మండిపడ్డారు. పోలీసు బెదిరింపులకు భయపడమని... వైకాపా నేతల తీరు ఇలానే కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కుతామని హెచ్చరించారు.
మాజీ ఎమ్మెల్యే చంగల వెంకటారావు, వైకాపా మహిళా నేత రోజారాణిపై తెలుగు మహిళలు ఫిర్యాదు చేశారు. అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలు నుంచి ఫిర్యాదు తీసుకునేందుకే ప్రభుత్వం భయపడుతోందని మండిపడ్డారు. మహిళల్ని అవమానించటమే ఈ ప్రభుత్వ ధ్యేయంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు బెదిరింపులకు భయపడమని... వైకాపా నేతల తీరు ఇలానే కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కుతామని హెచ్చరించారు. అనితకు వైకాపా నేతలు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర మహిళ కమిషన్కు సైతం మహిళలు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: