మహిళల అక్రమ రవాణాలో ఏపీ రెండవ స్థానంలో ఉందని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. మహిళా దినోత్సవం జరుపుకొనే హక్కు సీఎం జగన్కు లేదని ఆమె దుయ్యబట్టారు. మహిళా హోంమంత్రి ఒక డమ్మీ అని మండిపడ్డారు. దిశా చట్టమే లేదు..హోంమంత్రి సుచరిత ముగ్గురికి శిక్ష ఎక్కడ విధించిందని అనిత ప్రశ్నించారు. వైకాపాలో గంట, అరగంట మంత్రులు ఉండటం వల్లే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె ఆరోపించారు. సీఎం అధికార దాహానికి ఇద్దరు సొంత చెల్లెళ్లు బలి అయ్యారన్నారు. పోలీసుల సాయం లేకుండా తాడేపల్లి నుంచి సీఎం అసెంబ్లీకి వెళ్లగలరా? అని నిలదీశారు. ఐపీఎస్లు అంటే తనకు గౌరవమని, కానీ వారి బాధ్యత వారు మర్చిపోయారని విమర్శించారు. వైకాపా నేతలు తిడుతున్నా పోలీసులకు కనిపించడం లేదని అనిత మండిపడ్డారు.
'మహిళల అక్రమ రవాణాలో ఏపీది రెండవ స్థానం'
వైకాపా ప్రభుత్వంపై తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. మహిళల అక్రమ రవాణాలో ఏపీ రెండవ స్థానంలో ఉందని ... మహిళా దినోత్సవం జరుపుకునే హక్కు సీఎంకు లేదన్నారు. మహిళా హోంమంత్రి ఒక డమ్మీ అని తెలిపారు. సీఎం అధికార దాహానికి ఇద్దరు సొంత చెల్లెళ్లు బలి అయ్యారన్నారు.
వంగలపూడి అనిత