ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 18, 2020, 6:46 AM IST

ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్: విదేశాల్లో తెలుగు విద్యార్థులు విలవిల

కోవిడ్​-19 (కరోనా వైరస్‌) ప్రపంతం వ్యాప్తంగా విజృంభిస్తోంది. దింతో పలు దేశాల నుంచి భారత్‌కు వచ్చే విమానాలను నిలిపివేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించడంతో దాదాపు 350 మంది భారతీయులు కౌలాలంపూర్‌, మనీలా విమానాశ్రయాల్లో రోజంతా పడిగాపులు కాశారు. వీరిలో 200 మంది వరకు తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. మంగళవారం ఉదయమే విమానాశ్రయాలకు చేరుకున్న వారు.. దాదాపు అర్ధరాత్రి వరకు అక్కడే వేచి ఉండాల్సి వచ్చింది. ఎట్టకేలకు కౌలాలంపూర్‌ విమానాశ్రయం నుంచి దిల్లీ, విశాఖపట్నాలకు ఎయిర్‌ ఏషియా విమానాలను అనుమతిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ప్రకటించడంతో వారందరికీ ఊరట లభించింది.

కౌలాలంపూర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు
కౌలాలంపూర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు

కరోనా భయంతో పలు దేశాల నుంచి భారత్‌కు వచ్చే విమానాలను నిలిపివేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించడంతో దాదాపు 350 మంది భారతీయులు కౌలాలంపూర్‌, మనీలా విమానాశ్రయాల్లో రోజంతా పడిగాపులు కాశారు. వీరిలో 200 మంది వరకు తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. వీరిలో తెలంగాణలోని వరంగల్‌, హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలవారు వీరిలో ఉన్నారు. మంగళవారం ఉదయమే విమానాశ్రయాలకు చేరుకున్న వారు.. దాదాపు అర్ధరాత్రి వరకు అక్కడే వేచి ఉండాల్సి వచ్చింది. ఎట్టకేలకు కౌలాలంపూర్‌ విమానాశ్రయం నుంచి దిల్లీ, విశాఖపట్నాలకు ఎయిర్‌ ఏషియా విమానాలను అనుమతిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ప్రకటించడంతో వారందరికీ ఊరట లభించింది.

సెలవులిచ్చారని బయలుదేరి..
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఫిలిప్పీన్స్‌లోని పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు విద్యార్థులకు 50-60 రోజుల సెలవులు ప్రకటించాయి. అక్కడ చదువుతున్న విదేశీ విద్యార్థులు 72 గంటల్లోగా స్వదేశాలకు వెళ్లిపోవాలని అక్కడి ప్రభుత్వం సోమవారం సూచించింది. దీంతో వందలమంది తెలుగు విద్యార్థులు మంగళవారం ఉదయం మనీలా (ఫిలిప్పీన్స్‌) విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరంతా మలేసియాలోని కౌలాలంపూర్‌ మీదుగా భారత్‌కు రావాలి. కొందరు కౌలాలంపూర్‌లో, మరికొందరు మనీలాలో చిక్కుకుపోయారు. అయితే భారత్‌ వచ్చే విమానాలన్నీ రద్దవ్వడంతో వారంతా విమానాశ్రయంలో రోజంతా పడిగాపులు కాశారు. కౌలాలంపూర్‌లో 150 మంది, మనీలాలో 60 మంది ఇలా చిక్కుకుపోయారు. విమానాలను అనుమతిస్తున్నట్లు మంగళవారం రాత్రి కేంద్రమంత్రి చేసిన ప్రకటన వారికి పెద్ద ఊరటనిచ్చింది.

కౌలాలంపూర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు

తెలుగు విద్యార్థులను వెనక్కి రప్పించండి: ఏపీ సీఎం జగన్‌
పలు దేశాల నుంచి భారత్‌కు రావాల్సిన విమానాలు నిలిచిపోవటంతో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థుల పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఆరాతీశారు. వారిని వెనక్కి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి:దేశంలో కరోనా కేసులు@137.. సర్వం బంద్​!

ABOUT THE AUTHOR

...view details