'అనర్హులైనప్పటికీ... అధికారులు అర్హులుగా గుర్తించారు' - మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తాజా న్యూస్
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పులికొండ పంచాయతీ ఎన్నికల్లో అనర్హులను.. అధికారులు గెలిచినట్లుగా ప్రకటించారని తెలుగురైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. లెక్కింపు సమయంలో తెదేపా బలపరిచిన సర్పంచి అభ్యర్థి ఓట్లను లెక్కించకుండానే అధికారులు ఫలితాన్ని ప్రకటించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంచాయతీ ఎన్నికల్లో అనర్హులను.. గెలుపొందినట్లుగా అధికారులు ప్రకటించారని తెలుగురైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పులికొండ పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లలున్న వైకాపా మద్దతుదారులు పోటీ చేశారని తెలిపారు. దీనిపై అన్ని ఆధారాలు చూపించినప్పటికీ అధికారులు వారిని అర్హులుగా గుర్తించారని ఆరోపించారు. ఈ క్రమంలో అధికార పార్టీ చేసిన తప్పులను అధిగమించి తెదేపా మద్దతుదారులు ఎన్నికల్లో పోటీ చేశారన్నారు. లెక్కింపు సమయంలో తెదేపా బలపరిచిన సర్పంచి అభ్యర్థి ఓట్లు లెక్కించకుండానే అధికారులు ఫలితాన్ని ప్రకటించారని మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.