ముంపు బాధితులు నీటిలో నానుతున్నా వైకాపా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వరద నష్టంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటే ప్రభుత్వం ఒట్టిమాటలతో కాలక్షేపం చేస్తోందని విమర్శించారు. ఇంతవరకూ నష్టం అంచనాకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 లక్షల ఎకరాలకుపైగా వరి, 30వేల హెక్టార్లలో పత్తి, లక్ష ఎకరాలకు పైగా పప్పు ధాన్యాలు, 60వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లిందని మర్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.
ఇంతవరకూ పంట నష్టం అంచనా వేయలేదు-మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి - marrireddy on ysrcp government
వరదల కారణంగా నష్టపోయిన రైతును ఆదుకోవడానికి వైకాపా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఇంతవరకూ పంట నష్టం అంచనా వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి