ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Accident on Highway: హైదరాబాద్​-విజయవాడ హైవేపై ప్రమాదం.. భారీగా ట్రాఫిక్​ జామ్​ - accident on hyd vijayawada highway

హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో ప్రమాదం జరిగింది. తెలంగాణ నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ప్రమాదంతో రహదారిపై 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది.

Accident on Highway
Accident on Highway

By

Published : Dec 6, 2021, 10:41 AM IST

Accident on Hyderabad-vijayawada Highway: తెలంగాణ నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న లారీ.. యూటర్న్ చేస్తుండగా ముందు వెళ్తున్న కార్లను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. బస్సు ఢీ కొట్టడంతో ముందున్న కార్లు.. లారీని ఢీ కొట్టాయి. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి.

క్షతగాత్రులను నార్కట్​పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంతో రహదారిపై 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. భారీగా వాహనాలు నిలిచి.. రాకపోకలకు అంతరాయం కలిగింది.

ఇదీ చదవండి:

Man Attack On Woman: పెట్రోల్ బంక్​లో పనిచేస్తున్న మహిళపై యువకుడి చెప్పు దెబ్బ

ABOUT THE AUTHOR

...view details