అధికార పార్టీ నేతలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు చేసినా ఈసీ చర్యలు తీసుకోలేదని తెదేపా నేతలు వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. తాడిపత్రిలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి చీరలు పంచారని, చిత్తూరు జిల్లాలో వాలంటీర్లను ఎన్నికల ప్రచారంలో వినియోగిస్తున్నారని ఫొటోలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశామని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఘటనలపై సాక్ష్యాలతో సహా ఇచ్చినా చర్యలు తీసుకోలేదని వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం వీటిపై ఏం చర్యలు తీసుకున్నారని ఎన్నికల కమిషన్ను ప్రశ్నించింది. సంఘటనలపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని రెండు జిల్లాల కలెక్టర్లను కోరామని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సోమవారం నాటికి పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని న్యాయస్థానం ఈసీని ఆదేశించింది.
'ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ఏం చర్యలు తీసుకున్నారు' - ఎన్నికల సంఘంపై హైకోర్టు ఆగ్రహం
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నిబంధనలు అతిక్రమించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఈసీని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని నమోదైన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం... సోమవారం నాటికి పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఈసీని ఆదేశించింది.
ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి