రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌తో తెలంగాణా మాజీ ఎన్నికల కమిషనర్, ఎన్నికల సంఘం సలహాదారు నాగిరెడ్డి భేటీ అయ్యారు. విజయవాడలోని ఎస్‌ఈసీ కార్యాలయానికి వచ్చిన నాగిరెడ్డి.. ఎస్ఈసీతో వివిధ అంశాలపై చర్చించారు. నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ అంశంపై వారిరువురూ చర్చించినట్లు వెల్లడించారు.
నిమ్మగడ్డతో తెలంగాణ మాజీ ఎస్‌ఈసీ నాగిరెడ్డి భేటీ - ఏపీ ఏంపీటీసీ ఎన్నికల తాజా వార్తలు
ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌తో తెలంగాణ మాజీ ఎస్‌ఈసీ నాగిరెడ్డి భేటీ అయ్యారు. పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది.
telengana former election commissioner meet AP sec ramesh kumar
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్ల గందరగోళం, బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ, వివిధ అంశాలపై కోర్టు ఆదేశాలపై నిమ్మగడ్డ రమేశ్ కుమార్-నాగిరెడ్డి భేటీలో ప్రస్తావన వచ్చినట్టు సమాచారం. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తూ... నోటిఫికేషన్ జారీ చేసే అంశం.. ఎదురయ్యే ఇబ్బందుల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: తుది దశకు చేరిన పల్లె పోరు.. రేపు నాలుగో దశ ఎన్నికలకు పోలింగ్