ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Miracle Borewell: మోటారు లేకుండానే ఉప్పొంగుతున్న పాతాళ గంగ.. ఆరేళ్లుగా ఆగని జలధార..! - borewell is flowing without motor in shivapuram

Bore Flows without motor: సాధారణంగా బోరు బావి తవ్విస్తే నీరు రావొచ్చు. రాకపోవచ్చు. కొన్నిసార్లు వచ్చినా మోటారు వేశాకైనా ఆశించిన స్థాయిలో నీరు వచ్చే పరిస్థితి ఉండదు. ఇక వేసవి కాలమొస్తే దాదాపుగా బోర్లన్నీ ఎండిపోతుంటాయి. కానీ ఈ బోరు మాత్రం అలా కాదు. కాలంతో సంబంధం లేదు.. మోటారుతో సంబంధం లేదు. గత ఆరేళ్లుగా నిరంతరం ప్రవహిస్తూ 30 ఎకరాలకు సాగు నీరు అందిస్తోంది. నేల తల్లి దాహం తీరుస్తోంది.

ఆరేళ్లుగా ఆగని జలధార
ఆరేళ్లుగా ఆగని జలధార

By

Published : Dec 25, 2021, 6:18 PM IST

మోటారు లేకుండానే పొంగుతున్న గంగమ్మ

Bore Flows without motor: ఆరేళ్ల క్రితం ఓ రైతు.. తన పొలానికి నీటి వసతి లేకపోవడంతో బోరు వేయాలని నిర్ణయించారు. ఒకసారి వేసినపుడు నీరు పడలేదు. రెండో సారి వేశారు. ఈ సారి కూడా డబ్బులు వృథా అయ్యాయి కానీ చుక్క నీరు పడలేదు. మూడో ప్రయత్నంగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ రైతు బాధను గంగమ్మ అర్థం చేసుకుందేమో.. కరుణించి ఇక అప్పటి నుంచి అతని పొలానికి సాగు నీటి కష్టాలను తీరుస్తూనే ఉంది. ఈ ఆరేళ్లలో బండలు పగిలే ఎండలు మండినా.. ఆ బోరు మాత్రం ఎండిపోలేదు. నిరంతరం జలధార పారుతూనే ఉంది. విచిత్రం ఏమంటే.. ఆ రైతు ఈ బోరు వేసినప్పటి నుంచి మోటారు అవసరం లేకుండానే గంగమ్మ ప్రవహిస్తోంది. దీంతో ఆ రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

కాలంతో సంబంధం లేదు..
Bore Flows without motor in shivapuram: తెలంగాణలోని ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శివాపురం గ్రామానికి చెందిన కుంట రంగారెడ్డి ఆరేళ్ల క్రితం వేసిన బోరు నుంచి నిరంతరంగా జలాలు వస్తూనే ఉన్నాయి. వేసవి, చలి, వానా కాలం ఇలా ఏ కాలంలోనూ ఆ జలధార ఇంకిపోకుండా నిరంతరం బోరు బావి నుంచి మోటార్ సహాయం లేకుండానే పోస్తూనే ఉంటుంది. ఆరేళ్లుగా ఏ రోజూ బోరుబావి నుంచి నీళ్లు రావడం ఆగిపోలేదని రంగారెడ్డి చెబుతున్నారు.

"వానాకాలం, ఎండాకాలం అనే తేడాలేకుండా నిరంతరం ఈ బోరు నుంచి జలధార కొనసాగుతూనే ఉంటుంది. ఆరేళ్ల క్రితం వేసిన ఈ బోరు ఇప్పటి వరకూ ఇంకిపోయిన దాఖలాలు లేవు. ఈ బోరు కింద మా 20 ఎకరాలు సాగవుతున్నాయి. మా పొలం పక్కనున్న మరికొందరికి చెందిన పదెకరాలు సాగవుతున్నాయి. మోటారు లేకుండా బోరు పనిచేయడమే కాకుండా ఇంతమందికి ఉపయోగపడటం ఆనందంగా ఉంది." -కుంట రంగారెడ్డి, రైతు శివాపురం

మరో 10 ఎకరాలు..
ఈ బోరు బావి కింద వారి కుటుంబానికి చెందిన 20 ఎకరాలు సాగవుతున్నాయి. అంతే కాకుండా సమీప రైతులకు చెందిన మరో 10 ఎకరాల్లో ఖరీఫ్​, యాసంగి రెండు పంటలు సాగవుతున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మరో పది బోరుబావుల వరకు ఇలాగే నీరు పోస్తున్నాయని.. కానీ ఈ బోరు నుంచి మాత్రం ఎక్కువ నీరు వస్తుందని హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:ఆ రికార్డులు నాశనం చేసేందుకే.. కోర్టులో బాంబు దాడి!

ABOUT THE AUTHOR

...view details