ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Akhanda team at Yadadri : దేశం గర్వించే స్థాయిలో.. యాదాద్రి పునర్నిర్మాణం: బాలకృష్ణ - ap latest news

Akhanda team at Yadadri: "అఖండ" సినిమా ఘన విజయం సాధించడంతో.. ఆ చిత్రబృందం తెలంగాణలోని యాదాద్రీశుణ్ని దర్శించుకుంది. సినీ నటుడు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.

AKHANDA AT YADADRI
AKHANDA AT YADADRI

By

Published : Dec 27, 2021, 3:39 PM IST

యాదాద్రి ప్రధాన ఆలయాన్ని పరిశీలిస్తున్న బాలయ్య
బాలకృష్ణకు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేస్తున్న ఆలయ సిబ్బంది

Akhanda team at Yadadri: దేశం గర్వించే స్థాయిలో యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించిన తెలంగాణ సీఎం కేసీఆర్​కు.. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. చరిత్రలో నిలిచిపోయేలా కృష్ణశిలతో ఆలయాన్ని తీర్చిదిద్దిన శిల్పులకు, ఆలయ నిర్మాణంలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

దేశం గర్వించే స్థాయిలో యాదాద్రి పునర్నిర్మాణం
ప్రధాన ఆలయం వద్ద బాలయ్య

ఈ ఉదయం అఖండ చిత్రబృందంతో కలిసి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న బాలయ్య.. దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొండపైన పునర్నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆలయాన్ని పరిశీలించారు. తెలంగాణ సీఎం కేసీఆర్​ ప్రత్యేక శ్రద్ధతో.. యాదాద్రి పునర్నిర్మాణం చేపట్టారని బాలయ్య కొనియాడారు.

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని చూస్తుంటే మహాద్భుతంలా అనిపిస్తోంది. తిరుపతికి ధీటుగా.. తెలంగాణ సీఎం కేసీఆర్​ ప్రత్యేక శ్రద్ధ, దృఢ సంకల్పంతో ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు. దేశవ్యాప్తంగా ప్రజలు దర్శించుకునేలా ఆలయ వైభవం ఉంది. ఇందులో భాగమైన, శిల్పులు, రాళ్లెత్తిన వారికి, పనిచేసిన వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. -నందమూరి బాలకృష్ణ, సినీ నటుడు

BalaKrishna At Yadadri : యాదాద్రి నిర్మాణం తెలంగాణ సీఎం కేసీఆర్ దృఢ సంకల్పానికి నిదర్శనమని బాలకృష్ణ అన్నారు. తన ఇష్ట దైవం లక్ష్మీ నరసింహ స్వామి అని.. చిన్నతనం నుంచి ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నట్లు చెప్పారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని స్వామి వారిని ప్రార్థించినట్లు చెప్పారు.

ఇదీ చదవండి:AP High Court: ఫీజుల ఖరారుపై.. 53, 54 జీవోలను తోసిపుచ్చిన హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details