CBN TOUR IN TS: గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తున్న చంద్రబాబుకు తెలంగాణ సరిహద్దులోని ముత్తగూడెం వద్ద తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు బక్కని నరసింహులు, తెలుగుదేశం శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఖమ్మం జిల్లా సత్తుల్లిలోనూ పార్టీ నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. సత్తుపల్లిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయాలని అభిమానులు చంద్రబాబును పట్టుబట్టగా.. ఇప్పటికీ ఆలస్యమైందంటూ ఆయన ముందుకు కదిలారు. మరోసారి సత్తుపల్లి తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు.
CBN TOUR IN TS: ఖమ్మం జిల్లాలో చంద్రబాబు పర్యటన.. నేతల ఘనస్వాగతం - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
CBN TOUR IN TS: గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటనకు బయల్దేరిన చంద్రబాబుకు తెలంగాణలో ఘనస్వాగతం లభించింది. తెలంగాణ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నరసింహులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు.
![CBN TOUR IN TS: ఖమ్మం జిల్లాలో చంద్రబాబు పర్యటన.. నేతల ఘనస్వాగతం CBN TOUR](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15947221-503-15947221-1658997320410.jpg)
CBN TOUR
చంద్రబాబుకు తెదేపా నేతల ఘనస్వాగతం
చంద్రబాబుకు తెదేపా నేతల ఘనస్వాగతం
DEVINENI UMA: పోలవరం విలీన మండలాల పర్యటనకు బయలుదేరిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఎక్కడికక్కడ ఘనస్వాగతం లభిస్తోంది. మైలవరం నియోజకవర్గంలో మాజీమంత్రి దేవినేని ఉమా ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీగా చంద్రబాబు వాహనశ్రేణి వెంట బయలుదేరారు. విజయవాడ పశ్చిమ, తిరువూరు, తెలంగాణలోని సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల మీదుగా చంద్రబాబు పర్యటన సాగుతుంది.
ఇవీ చదవండి: