కరోనా నేపథ్యంలో మార్చిలో జరగాల్సిన పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు అంగీకరించడంతో ప్రభుత్వం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. కొవిడ్ నిబంధనలకు లోబడి జూన్ 8 నుంచి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
పరీక్షా కేంద్రాల్లో భౌతికదూరం
విద్యార్థులు దూరం పాటించేలా... హైకోర్టు సూచనల మేరకు ప్రస్తుతం ఉన్న 2,530 పరీక్షా కేంద్రాలకు అదనంగా... మరో 2,005 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అందుకు అనుగుణంగా... 26,422 మంది ప్రభుత్వ సిబ్బంది సేవలు వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. గతంలో కేటాయించిన వాటికి సమీప దూరంలోనే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వీటి వివరాలను సంబంధిత ప్రధానోపాధ్యాయులు, చీఫ్ సూపరింటెండెంట్ ద్వారా తెలియజేస్తామని వివరించారు.
విద్యార్థులకు మాస్కులు