Telangana Cabinet meeting: రాచరికం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 16, 17, 18 తేదీల్లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. సెప్టెంబరు 17ను జాతీయ సమైక్యతా దినంగా పాటిస్తామని కేబినెట్ తెలిపింది.
సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యతా దినం: కేబినెట్ - సెప్టెంబర్ 17
Telangana Cabinet: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈరోజు జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 16, 17, 18 తేదీల్లో ఈ వజ్రోత్సవాలు నిర్వహించాలని.. 17వ తేదీన జాతీయ సమైక్యతా దినం పాటించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
telangana cabinet
సీఎంకు వినతిపత్రం అందజేసిన సీపీఎం నేతలు:అంతకుముందు సీఎం కేసీఆర్‌తో రాష్ట్ర సీపీఎం నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన 20 సమస్యలపై సీఎంకు వినతిపత్రాన్ని సమర్పించారు. పోడు భూములు, ధరణి సమస్యలు, కౌలు రైతులు, గిరిజన రిజర్వేషన్లు, ఏకకాలంలో రుణమాఫీ, వీఆర్‌ఏలకు పేస్కేలు, ఉద్యోగాలు భర్తీ, ఉద్యోగుల బదిలీ తదితర అంశాలపై విజ్ఞప్తులు అందజేశారు.
ఇవీ చదవండి: