TS SSC Exams: తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 11 నుంచి 17 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. అలాగే, మే 18 నుంచి 20 వరకు ఓఎస్‌ఎస్‌సీ, ఒకేషనల్ విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని తెలిపింది. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమై మధ్యాహ్నం 12.45గంటల వరకు కొనసాగుతుందని తెలిపింది.
ఏప్రిల్లో ఇంటర్ పరీక్షలు..
ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ నెలలోనే జరగనున్నాయి. మే నెలలో పరీక్షలు జరపాలని భావించినప్పటికీ.. ఏప్రిల్ 20 నుంచి పరీక్షల షెడ్యూలు ఖరారు చేశారు. ఏప్రిల్ 20 నుంచి మే 9 వరకు మొదటి సంవత్సరం.. ఏప్రిల్ 21 నుంచి మే 10 వరకు రెండో సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ప్రధాన పరీక్షలు మే 5 నాటికే ముగియనున్నాయి. అప్పటికి ఎండ తీవ్రత పెరగనున్నందున ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.