Telangana Corona: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. ఇవాళ ఒకేరోజు నాలుగు వేలకు పైగా మంది కొవిడ్ బారిన పడినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా 4,416 మందికి వైరస్ నిర్ధరణ అయింది. దీనితో ఇప్పటి వరకు 7,26,819 మంది మహమ్మారి బారిన పడ్డారు. ఇక ఈరోజు 1,920 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కొవిడ్ నుంచి 6,93,623 మంది రికవరీ అయ్యారు. తాజాగా మరో ఇద్దరు మృతి చెందగా.. కొవిడ్ మరణాలు 4069కి చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 29,127 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ 1670 కేసులు నమోదయ్యాయి.
జిల్లాల వారీగా..
తాజాగా నమోదైన కేసుల్లో ఆదిలాబాద్ 25, కొత్తగూడెం 88, జగిత్యాల 65, జనగామ 41, జయశంకర్ భూపాలపల్లి 36, జోగులాంబ గద్వాల 50, కామారెడ్డి 40, కరీంనగర్ 91, ఖమ్మం 117, కుమురంభీం ఆసిఫాబాద్ 32, మహబూబ్ నగర్ 99, మహబూబాబాద్ 70, మంచిర్యాల 92, మెదక్ 52, మేడ్చల్ మల్కాజిగిరి 417, ములుగు 27, నాగర్కర్నూల్ 72, నల్గొండ 90, నారాయణపేట 36, నిర్మల్ 36, నిజామాబాద్ 75, పెద్దపల్లి 73, రాజన్న సిరిసిల్ల 44, రంగారెడ్డి 301, సంగారెడ్డి 99, సిద్దిపేట 73, సూర్యాపేట 59, వికారాబాద్ 63, వనపర్తి 46, వరంగల్ 70, హనుమకొండ 178, యాదాద్రి భువనగిరి 89 చొప్పున కొవిడ్ కేసులు వెలుగు చూశాయి.
ప్రారంభమైన ఫీవర్ సర్వే