ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఈరోజు రాత్రి లైట్లు మాత్రమే ఆపాలి'

అన్ని ఇళ్లలో ఒకేసారి విద్యుద్దీపాలు ఆపడం వల్ల కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జరుగుతుందనే ప్రచారంలో వాస్తవం లేదని తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ తెలిపారు. ప్రతి ఇంటిలో విద్యుద్దీపాలు మాత్రమే తొమ్మిది నిమిషాలు ఆపాలని విద్యుత్తు శాఖాధికారులు ప్రకటించారు.

telangana-prepared-to-light-for-nation
telangana-prepared-to-light-for-nation

By

Published : Apr 5, 2020, 12:12 PM IST

ప్రధాని మోదీ పిలుపు మేరకు కరోనాపై పోరుకు స్ఫూర్తినిస్తూ ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు ప్రతి ఇంటిలో విద్యుద్దీపాలు మాత్రమే తొమ్మిది నిమిషాలు ఆపాలని విద్యుత్తు శాఖాధికారులు ప్రకటించారు. ‘ఫ్యాన్లు, ఏసీలు, ఫ్రిజ్‌, కూలర్లు వంటి వాటిని ఆపకూడదు. అపార్టుమెంట్లు, కాలనీలకు కరెంటు సరఫరా అయ్యే ప్రధాన వ్యవస్థలైన ట్రాన్స్‌ఫార్మర్లు, మెయిన్‌ వద్ద సరఫరా కొనసాగించాలి. వీధి దీపాలు కూడా వెలగనివ్వాలి’ అని సూచించారు.

గ్రిడ్‌పై ప్రభావం..

దేశంలో ఒకేసారి దీపాలు ఆపేస్తే విద్యుత్తు గ్రిడ్‌పై ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర విద్యుత్తు శాఖ అన్ని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. దేశంలో గరిష్ఠంగా 12,897 మెగావాట్ల లోడు తగ్గుతుందని అంచనా వేసింది. ఈ మేరకు విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తిని రాత్రి తొమ్మిది గంటలకు ముందు తగ్గించి మళ్లీ 9.09 గంటలకు ప్రారంభించాలని సూచించింది.

తెలంగాణలోని నాగార్జునసాగర్‌, శ్రీశైలం జల విద్యుత్కేంద్రాల్లో రివర్స్‌ పంపింగ్‌ విధానంలో విద్యుదుత్పత్తికి అవకాశముంది. వీటిలో ఆదివారం రాత్రి 8.57 గంటలకు ఉత్పత్తి ప్రారంభించాలని కేంద్రం సూచించింది. దీనికి సమాంతరంగా థర్మల్‌ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గిస్తారు. తిరిగి సాగర్‌, శ్రీశైలంలో 9.10 గంటలకు ఉత్పత్తి తగ్గించి థర్మల్‌ కేంద్రాల్లో పెంచుతారు.

సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండదు

అన్ని ఇళ్లలో ఒకేసారి విద్యుద్దీపాలు ఆపడం వల్ల కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జరుగుతుందనే ప్రచారంలో వాస్తవం లేదు. తెలంగాణలోని ఇళ్లన్నింటిలో దీపాలు ఆపివేసినా 600 మె.వా. వరకూ లోడు తగ్గుతుంది. 1100 మె.వా. లోడు ఒకేసారి తగ్గినా సరఫరాకు ఇబ్బంది లేకుండా మన విద్యుత్తు పంపిణీ వ్యవస్థ పటిష్ఠంగా ఉంది. - దేవులపల్లి ప్రభాకర్‌రావు, సీఎండీ, తెలంగాణ జెన్‌కో-ట్రాన్స్‌కో

ఇదీ చదవండి: 25 సెకన్లలో శరీరంపై ఉన్న క్రిములన్నీ కడిగేస్తుంది!

ABOUT THE AUTHOR

...view details