గరికపాడు చెక్‌పోస్టు వద్ద అంబులెన్సుల అడ్డగింత - andra telangana check post
11:04 May 11
గరికపాడు చెక్‌పోస్టు వద్ద తెలంగాణ పోలీసుల తనిఖీలు
గరికపాడు చెక్‌పోస్టు వద్ద తెలంగాణ పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు వెళ్లే అంబులెన్సులను వారు నిలిపివేస్తున్నారు. మార్గం మధ్యలోనే అంబులెన్సుల్లో కరోనా బాధితులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. హైదరాబాద్‌లో బెడ్ కేటాయింపు ఉంటేనే అనుమతిస్తున్నారు. చరవాణిలో అమమతి పత్రాలుంటే పోలీసులు అనుమతించడం లేదు. ప్రాణాపాయ స్థితిలో ఆక్సిజన్‌తో వెళ్తున్న వారిపై కూడా పోలీసులు కనికరం చూపకపోవడంతో రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:తిరుపతి రుయా ఆస్పత్రిలో ఘటనపై గవర్నర్ దిగ్భ్రాంతి