కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయం విజయవాడలో ఏర్పాటు చేస్తామంటే అంగీకారం తెలిపామని, ఇప్పుడు కృష్ణా బేసిన్‌కు బయట, సంబంధం లేని ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల కార్యకలాపాలకు ఇబ్బందవుతుందని తెలంగాణ అభిప్రాయపడింది. అపెక్స్ కౌన్సిల్ భేటీలో కూడా ఈ విషయం చర్చించకుండా అకస్మాత్తుగా విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తామని చెప్పడం సరైంది కాదంది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు సోమవారం లేఖ రాశారు. దీంతోపాటు కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ మరికొన్ని ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినట్లు కూడా బోర్డు దృష్టికి తెలంగాణ తెచ్చింది. ఇటీవల పరిపాలనా అనుమతి ఇచ్చిన మూడు ప్రాజెక్టుల గురించి వివరించినట్లు తెలిసింది.
కృష్ణా బోర్డు విశాఖలో వద్దు: తెలంగాణ అభ్యంతరం - telangana refuse krishna board in vishaka news
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయం విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం తమకు సమ్మతం కాదని తెలంగాణ పేర్కొంది. ఇది తమకు అనుకూలం కాదని పేర్కొంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది.

telangana on krishna board in vishaka