విజయవాడ ముఖ్యమైన ఆర్థిక కేంద్రం అని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోనే హైదరాబాద్ ఓ ముఖ్యమైన మెట్రోపాలిటన్ నగరమని తెలిపారు. అలాంటి ఈ రెండు పట్టణాలు హైదరాబాద్ - విజయవాడ మధ్య.. హైస్పీడ్ రైలు సేవలు అందుబాటులోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ మేరకు తమ వంతు కృషిచేస్తామని.. రైలు వస్తే హైవే వెంట మరింత అభివృద్ధి జరుగుతుందని అభిలషించారు. సోమవారం ఆయన తెలంగాణలోని హుజూర్‌నగర్ ఆర్డీవో నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. పురపాలక కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఆ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు.