తెలంగాణ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదంపై హైకోర్టు విచారణ జరిపింది. చెన్నమనేని రమేశ్‌కు ఇప్పటికీ జర్మనీ పౌరసత్వం ఉందని కేంద్రం హైకోర్టుకు తెలిపింది. 2023 వరకు జర్మనీ పౌరసత్వాన్ని పొడిగించుకున్నారని తెలిపిన కేంద్ర హోంశాఖ మెమో రూపంలో వివరాలు సమర్పించింది.
తెలంగాణ: చెన్నమనేని కేసు.. కేంద్ర హోంశాఖపై హైకోర్టు అసంతృప్తి - చెన్నమనేని వార్తలు
కేంద్ర ప్రభుత్వం తన పౌరసత్వాన్ని రద్దు చేయడంపై తెలంగాణలోని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ఆ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా... సర్వోన్నత న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. కేంద్ర హోంశాఖ మెమో రూపంలో వివరాలు సమర్పించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
తెలంగాణ: చెన్నమనేని కేసు.. కేంద్ర హోంశాఖపై హైకోర్టు అసంతృప్తి
దీనిపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అఫిడవిట్ రూపంలో వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ వివాదంపై విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది.
ఇదీ చూడండి:శ్రీహరికోట: పీఎస్ఎల్వీ-సీ50 కౌంట్‌డౌన్ ప్రారంభం