ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 17, 2020, 7:17 PM IST

ETV Bharat / city

తెలంగాణ: డ్రగ్స్ కేసుపై హైకోర్టు విచారణ 2వారాలకు వాయిదా

తెలంగాణలో డ్రగ్స్ కేసులపై ఆ రాష్ట్ర ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హైకోర్టుకు ఎక్సైజ్ శాఖ నివేదిక సమర్పించింది. ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ కేసు వివరాలు ఇవ్వట్లేదని ఈడీ హైకోర్టుకు తెలిపింది.

తెలంగాణ: డ్రగ్స్ కేసుపై హైకోర్టు విచారణ 2వారాలకు వాయిదా
తెలంగాణ: డ్రగ్స్ కేసుపై హైకోర్టు విచారణ 2వారాలకు వాయిదా

డ్రగ్స్ కేసులు కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలన్న పిల్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. డ్రగ్స్ కేసులపై హైకోర్టుకు ఎక్సైజ్ శాఖ నివేదిక సమర్పించింది. 2017లో నమోదైన 12 డ్రగ్స్ కేసుల దర్యాప్తు పూర్తయిందని.. 11 ఛార్జిషీట్లు దాఖలు చేశామని మరో ఛార్జీషీట్ వేస్తామని ఎక్సై‌జ్ శాఖ వెల్లడించింది.

దర్యాప్తు చేసే అధికారం కేంద్ర సంస్థలతోపాటు తమకు కూడా ఉందని ఎక్సైజ్ శాఖ పేర్కొంది. కేంద్ర సంస్థలకు అప్పగించాల్సిన అవసరం లేదని ఎక్సైజ్ శాఖ తెలిపింది.

ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ కేసు వివరాలు ఇవ్వట్లేదని ఈడీ హైకోర్టుకు చెప్పింది. ఛార్జిషీట్లు, వాంగ్మూలాలు ఈడీకి ఇచ్చేలా ఆదేశించాలని అదనపు సొలిసిటర్ జనరల్ అన్నారు. ఎక్సైజ్ శాఖ నివేదికలో కనీస వివరాలు లేవని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు. ఎక్సైజ్‌శాఖ నివేదికపై అభ్యంతరాల సమర్పణకు పిటిషనర్ గడువు కోరారు. డ్రగ్స్ కేసు విచారణను హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చూడండి :పిండ ప్రదానానికి వెళ్లి.. పెన్నా నదిలో ఏడుగురు గల్లంతు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details