ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అన్ని కోర్టులు తెరవాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నిర్ణయం - telangana high court on unlock news

డిసెంబరు 31 వరకు కోర్టులు అనుసరించాల్సిన అన్‌లాక్‌ విధానాన్ని తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. ఆ రాష్ట్రంలో రాష్ట్రంలో అన్ని కోర్టులు తెరవాలని నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో అన్ని కోర్టులు తెరవాలని ఆ రాష్ట్ర హైకోర్టు నిర్ణయం
తెలంగాణలో అన్ని కోర్టులు తెరవాలని ఆ రాష్ట్ర హైకోర్టు నిర్ణయం

By

Published : Nov 8, 2020, 8:02 PM IST

తెలంగాణలో హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో కేసుల విచారణ భౌతికంగా కొనసాగుతోంది. హైదరాబాద్ జిల్లాలోని సివిల్, క్రిమినల్ కోర్టులూ తెరవాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టులో డిసెంబర్ 31 వరకు ప్రస్తుత ఆన్‌లైన్‌, భౌతిక విచారణ విధానమే కొనసాగించాలని నిర్ణయించింది.

ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ వేగంగా జరపాలని ప్రత్యేక కోర్టులకు హైకోర్టు సూచించింది. సీబీఐ, ఏసీబీ, ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల ప్రత్యేక కోర్టులు ప్రస్తుత విధానమే కొనసాగించాలని స్పష్టం చేసింది. హైకోర్టు విధించిన గడువుకు కట్టుబడి విచారణ జరపాలని ఉత్తర్వుల్లో రిజిస్ట్రార్ జనరల్ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details