Love Marriage: ప్రేమకు ఎల్లలు లేవని ఈ ప్రేమికులు నిరూపించారు. తెలంగాణ అబ్బాయి.. అమెరికా అమ్మాయి ఏడు అడుగులు, మూడు ముళ్లతో ఒకటయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు చెందిన అబ్బాయి భరత్ కుమార్.. అమెరికాలోని చికాగోకు చెందిన అమ్మాయి దుల్‌సీ వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం వైభవంగా జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు చెందిన భరత్‌కుమార్ బీటెక్ పూర్తి చేసిన అనంతరం.. ఎంఎస్ కోసం 2015లో అమెరికా వెళ్లాడు.
అమెరికా అమ్మాయి... భద్రాద్రి అబ్బాయి.. ఒక్కటైన జంట
Love Marriage: "ప్రేమించిన అమ్మాయి కోసం ఏడేడు సముద్రాలైనా దాటేస్తా.. ఎంత మందినైనా ఎదిరిస్తా.." అంటూ సినిమాల్లో హీరోలు పంచ్ డైలాగులు విసురుతుంటే ఈలలు కొడుతుంటాం. ఇక్కడ అదే డైలాగ్‌ని నిజం చేస్తూ మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లాడాడు తెలంగాణ కుర్రాడు. అమెరికాలో కలుసుకున్న భద్రాద్రి అబ్బాయి, చికాగో అమ్మాయి ప్రేమించుకుని.. పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు.
చదువు పూర్తి కాగానే ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. ఈ క్రమంలో చికాగోకు చెందిన దుల్‌సీతో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఒకరికొకరు నచ్చటం వల్ల స్నేహం కాస్తా.. ప్రేమగా మారింది. దుల్‌సీ వైద్యశాఖలో ఉద్యోగం చేస్తున్నారు. ఇరువురూ తమ పెద్దలను పెళ్లికి ఒప్పించి సంప్రదాయబద్ధంగా మనువాడారు. అమ్మాయి కుటుంబసభ్యులు, వరుడి కుటుంబీకులు, బంధువుల మధ్య వీరి వివాహం చర్లలో వైభవంగా సాగింది. హిందూ సంప్రదాయ ప్రకారం జరిగిన ఈ పెళ్లి వేడుక.. వధువు బంధువులను ఆకట్టుకుంది.
ఇవీ చదవండి: