కొవిడ్ రెండో దశ ఎంతో మంది పిల్లల కన్నవారిని తీసుకెళ్లింది. వారి కలలను నిర్దాక్షిణ్యంగా తుంచేసింది. అనాథలుగా మిగిల్చి.. వారి భవిష్యత్‌ను అయోమయంలోకి నెట్టేసింది. కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా నిలిచి ఆందుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది.
140 మంది అనాథలు..
తెలంగాణలో సుమారు 140 మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారని మహిళా శిశు సంక్షేమ శాఖ గుర్తించింది. వీరిలో ఏడాది వయస్సు నుంచి పదిహేనేళ్ల వారూ ఉన్నారు. వీరి సంరక్షణ కోసం హైదరాబాద్‌లోని వెంగళరావునగర్‌లో ప్రత్యేకంగా అన్ని సౌకర్యాలతో చిన్నపిల్లల హోంను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వైద్యులతో పాటు సిబ్బందినీ నియమించింది. ప్రతి జిల్లాలోనూ హోంలు ఏర్పాటు చేసింది.
ఆశ్రమాలకు రాము..