శ్రీశైలం నుంచి హంద్రీనీవాకు నీటిని మళ్లించకుండా చర్యలు తీసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. శ్రీశైలం జలవిద్యుత్తు ప్రాజెక్టు పేరిట వేరే బేసిన్‌కు నీటిని మళ్లించడమే కృష్ణా ట్రైబ్యునల్ తీర్పునకు విరుద్ధమని పేర్కొంది. కాగా మళ్లీ ఆంధ్రప్రదేశ్ విస్తరణ పనులు చేపట్టిందని, దీనిని అడ్డుకోవాలని బోర్డును కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదలశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు శనివారం లేఖ రాశారు. శ్రీశైలం వెనకభాగం నుంచి నీటిని తీసుకొని పక్కన ఉన్న పెన్నా బేసిన్‌కు, అక్కడి నుంచి తమిళనాడు సరిహద్దులో కుప్పం నియోజకవర్గం వరకు 700 కి.మీ దూరం వరకు తీసుకెళ్లేలా హంద్రీనీవా ఎత్తిపోతల పథకాన్ని 40 టీఎంసీలతో చేపట్టారని లేఖలో పేర్కొన్నారు.
Letter To KRMB: హంద్రీనీవా నుంచి కృష్ణా జలాలు ఏపీ వాడకుండా చూడాలి: తెలంగాణ - కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ లేఖ వార్తలు
16:20 August 28
కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ లేఖ
రోజుకు 3850 క్యూసెక్కుల సామర్థ్యంతో ఉన్న ఈ ప్రాజెక్టును ఆరువేల క్యూసెక్కులకు విస్తరిస్తున్నారని, ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని విన్నవించారు. దీనివల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు తెలంగాణ ప్రాజెక్టులపై ప్రభావం పడుతుందని వివరించారు. బచావత్ ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రం మాత్రమేనన్నారు. దీనినుంచి కృష్ణా బేసిన్ అవతలకు నీటిని మళ్లించేందుకు ట్రైబ్యునల్ అనుమతించలేదని, నది ఒడ్డున ఉన్న తెలంగాణ ప్రాంతాలను కాదని బేసిన్ బయట ఉన్న ప్రాంతానికి నీటిని తరలించడం అన్యాయమని చెప్పారు. తుంగభద్ర హైలెవల్ కెనాల్ తదితర ప్రాజెక్టుల ద్వారా బేసిన్ బయటకు నీటిని మళ్లిస్తారు కాబట్టి బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ కూడా కేటాయింపులు చేయలేదని, హంద్రీనీవా ద్వారా తుంగభద్ర హెచ్చెల్సీ దాటి నీటిని తీసుకెళ్తున్నారని, దీన్ని అడ్డుకోవాలని ఇ.ఎన్.సి. రాసిన లేఖలో కోరారు.
ఇదీ చదవండి:
KRMB, GRMB MEETING: సెప్టెంబర్ 1న కృష్ణా, గోదావరి బోర్డుల భేటీ