ఎంసెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌కు మొత్తం 2,19,410 దరఖాస్తులు అందాయి. గతేడాది కంటే ఈసారి రెండు వేలకుపైగా దరఖాస్తులు పెరిగాయి. ఇంజినీరింగ్‌కు 750 తగ్గగా.. అగ్రికల్చర్‌కు 2,961 దరఖాస్తులు పెరిగాయి. దరఖాస్తు గడువు బుధవారంతో ముగిసింది. రూ. 10,000 ఆలస్య రుసుంతో ఈనెల 30 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది.
విద్యార్థులు దరఖాస్తుల్లో పొందుపరిచిన వివరాల్లో ఏవైనా తప్పులుంటే ఈ నెల 11 నుంచి 16 వరకు సవరించుకోవచ్చు. ఈ నెల 22 నుంచి జులై 3 వరకు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జులై 6 నుంచి ఎంసెట్ ఆన్‌లైన్ పరీక్షలు మొదలవుతాయి.
ఇంజినీరింగ్‌కు 5 విడతల్లో పరీక్షలు