ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీపై కేఆర్​ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు.. ఆ రెండు ప్రాజెక్టులపై అభ్యంతరం

ప్రకాశం బ్యారేజీ దిగువన 2 ఆనకట్టల నిర్మాణ ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు బ్యారేజీల పనులు చేపట్టకుండా ఏపీని నిరోధించాలని కోరుతూ కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ రెండు లేఖలు రాశారు.

ఏపీపై కేఆర్​ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు
ఏపీపై కేఆర్​ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు

By

Published : Jul 5, 2022, 5:29 PM IST

Telangana Letter to KRMB: ఏపీపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. ప్రకాశం బ్యారేజీ దిగువన 2 ఆనకట్టల నిర్మాణ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ రెండు లేఖలు రాశారు. బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టులు చేపట్టరాదని లేఖలో పేర్కొన్నారు. రెండు కొత్త బ్యారేజీల పనులు చేపట్టకుండా ఏపీని నిరోధించాలని కోరారు. కృష్ణా జలాలపై ఆధారపడి పంప్డ్‌ స్టోరేజ్ స్కీమ్‌ల ప్రతిపాదనపై మరో లేఖ రాశారు.

జలవిధానం మేరకు తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేఆర్​ఎంబీని తెలంగాణ కోరింది. తాగునీటి అవసరాలు కాదని ఇతరత్రాలకు తరలింపు సరికాదని అభ్యంతరం వ్యక్తం చేసింది. పంప్డ్‌ స్టోరేజ్ స్కీమ్‌, విద్యుదుత్పత్తికి నీటి తరలింపు సరికాదంది. అనుమతి లేని పంప్డ్‌ స్టోరేజ్ స్కీమ్‌లను పరిశీలించాలని తెలంగాణ కోరింది. సీడబ్ల్యూసీ, బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేని వాటిని పరిశీలించాలని కోరింది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details