ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజస్థాన్​లో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ సీఐడీ డీజీకి గాయాలు.. భార్య మృతి - రోడ్డు ప్రమాదంలో సీఐడీ డీజీ భార్య మృతి

cid dgp govind singh
cid dgp govind singh

By

Published : Oct 10, 2022, 7:03 PM IST

Updated : Oct 10, 2022, 10:05 PM IST

19:01 October 10

రోడ్డు ప్రమాదంలో తెలంగాణ సీఐడీ డీజీ గోవింద్​సింగ్​ భార్య మృతి

రాజస్థాన్​లో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ సీఐడీ డీజీకి గాయాలు.. భార్య మృతి

Telangana CID DGP Govind singh: రాజస్థాన్​లోని జైసల్మీర్‌లో తెలంగాణ సీఐడీ డీజీ గోవింద్ సింగ్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆయన భార్య చనిపోగా.. గోవింద్​సింగ్​తో పాటు మరో ఇధ్దరికి గాయాలయ్యాయి. గాయపడిన సీఐడీ డీజీ, డ్రైవర్​ను బీఎస్‌ఎఫ్‌ అంబులెన్సులో రామ్‌గఢ్‌లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సీఐడీ డీజీ గోవింద్​సింగ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. తెలంగాణ సీఐడీ డీజీ ఐపీఎస్ గోవింద్​సింగ్ తన కుటుంబంతో కలిసి రాజస్థాన్​లోని రామ్​గఢ్​లో ఉన్న మాతేశ్వరి తనోత్‌ మాతా ఆలయ సందర్శనకు వెళ్లారు. దైవదర్శనం అనంతరం తమ కారులో తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో రామ్‌గఢ్ ప్రాంతంలో ఉన్న ఘంటియాలీ మాతా ఆలయం సమీపంలోకి రాగానే ఆయన కారు ఒక్కసారిగా బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న సీఐడీ డీజీ గోవింద్ సింగ్ భార్య షీలా సింగ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో డీజీ గోవింద్ సింగ్‌, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే వారిని బీఎస్‌ఎఫ్‌ అంబులెన్సులో రామ్‌గఢ్‌లోని ఆస్పత్రికి తరలించారు. సీఐడీ డీజీ గోవింద్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అలాగే డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 10, 2022, 10:05 PM IST

ABOUT THE AUTHOR

...view details