రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల బిల్లులకు సంబంధించిన ట్రెజరీ సర్వర్‌లో ఇబ్బందులు తలెత్తాయి. అయితే సర్వర్ సమస్య ఉన్నప్పటికీ.. కొత్త జీతాలు చెల్లించేలా సర్కారు యత్నిస్తోంది. ఈ మేరకు ఉద్యోగుల జీతాల బిల్లుల ప్రాసెస్ చేపట్టింది. సర్వర్ సమస్యలతో ట్రెజరీకి చేరిన బిల్లుల ప్రాసెసింగ్ ఆలస్యం కానుంది. ఈ క్రమంలో శని, ఆదివారాల్లోనూ బిల్లులు ప్రాసెస్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈరోజు వరకు 4.50 లక్షల బిల్లులకుగానూ కేవలం 1.10 లక్షల బిల్లులు మాత్రమే ట్రెజరీలకు చేరాయి. ఇప్పటివరకూ 25 శాతం మంది ఉద్యోగుల జీతాల బిల్లులు ప్రాసెస్ చేసినట్లు అధికారులు తెలిపారు. పోలీసుశాఖతోపాటు కోర్టు ఉద్యోగుల బిల్లులే చేరుకున్నట్టు ట్రెజరీ విభాగం వెల్లడించింది.