శాంతి భద్రతలను కాపాడేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని విజయవాడ సీపీ బి.శ్రీనివాసులు తెలిపారు. విజయవాడ పోలీసులు వినియోగిస్తున్న యూనిఫైడ్ కమాండ్ కంట్రోల్‌కు టెక్ సభ జాతీయస్థాయి అవార్డు దక్కిందని వివరించారు. ఈ అవార్డు రావటం చాలా సంతోషంగా ఉందని... తాము చేస్తున్న కృషికి నిదర్శనమే ఈ అవార్డు అని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టెక్ సభ అవార్డు ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.
విజయవాడ పోలీస్‌కు టెక్ సభ జాతీయస్థాయి అవార్డు - Tech Sabha Award to Vijayawada Police
విజయవాడ పోలీసులు వినియోగిస్తున్న యూనిఫైడ్ కమాండ్ కంట్రోల్‌కు టెక్ సభ జాతీయస్థాయి అవార్డు దక్కింది. ఈ విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు తెలిపారు. తాము చేస్తున్న కృషికి నిదర్శనమే ఈ అవార్డు అని పేర్కొన్నారు.
విజయవాడ పోలీస్‌కు టెక్ సభ జాతీయస్థాయి అవార్డు