teachers protest on PRC : పీఆర్‌సీపై మంత్రుల కమిటీతో పీఆర్‌సీ సాధన సమితి నాయకులు చేసుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నేడు విజయవాడలో నల్లబ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన తెలిపారు. నల్లబ్యాడీలు ధరించి ఉపాధ్యాయులు విధులకు హాజరయ్యారు. పీఆర్సీతో ఉపాధ్యాయులకు న్యాయం జరగలేదని ఆసంతృప్తి వ్యక్తం చేశారు.
మంత్రుల కమిటీతో పీఆర్‌సీ సాధన సమితి ..
పీఆర్‌సీపై మంత్రుల కమిటీతో శనివారం రాత్రి పీఆర్‌సీ సాధన సమితి నాయకులు చేసుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయులు పలు చోట్ల ఆందోళనలు నిర్వహించారు. మంత్రుల కమిటీతో చేసుకున్న ఒప్పంద పత్రాలను దహనం చేశారు. ఫిట్‌మెంట్ పెంపు లేకుండానే ఒప్పందం చేసుకున్నారని, హెచ్‌ఆర్‌ఏ శ్లాబులతో గ్రామీణ ప్రాంత ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల పాదాల ముందు దళారి నాయకులు ఉద్యమాన్ని తాకట్టుపెట్టారని విమర్శించారు. ప్రభుత్వంతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారని, లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛన్‌దారులను నమ్మించి సాధన సమితి నాయకులు మోసం చేశారని పేర్కొన్నారు. సమ్మె విరమణ నిర్ణయం సమంజసం కాదని, ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలకు పూర్తి విరుద్ధంగా మంత్రుల కమిటీతో ఒప్పందాలు ఉన్నాయని విమర్శించారు.