ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పీఆర్సీ జీవో ప్రతులను తగులబెట్టి... నిరసన తెలిపిన ఉపాధ్యాయులు - Teachers protest against PRC organisms

Teachers protest against PRC : ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. పీఆర్సీ జీవో ప్రతులను తగులబెట్టి నిరసన తెలిపారు. రివర్స్‌ పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు

Teachers protest in Vijayawada Dharna Chowk
Teachers protest in Vijayawada Dharna Chowk

By

Published : Jan 18, 2022, 7:09 PM IST

Teachers protest against PRC : రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి విడుదల చేసిన జీవోలను వెంటనే వెనక్కి తీసుకోవాలని విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేశాయి. పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ.. విజయవాడ ధర్నా చౌక్‌లో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. పీఆర్సీ జీవో ప్రతులను తగులబెట్టి నిరసన తెలిపారు. ఫిట్మెంట్ 34 శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీసీఏ ఇవ్వాలని ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. రివర్స్ పీఆర్సీని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తెచ్చిన పీఆర్సీ జీవోలతో 13లక్షల మంది ఉద్యోగ,ఉపాధ్యాయులకు తీవ్ర నష్టమని ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్‌ఆర్‌ఏ స్లాబ్ 20 శాతం ఉండేదని.. ఇప్పుడు 16శాతానికి తగ్గించారన్నారు. హెచ్‌ఆర్‌ఏ స్లాబులను వెంటనే సవరించాలని..తిరోగమన జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

పీఆర్సీ జీవో ప్రతులను తగులబెట్టి... నిరసన తెలిపిన ఉపాధ్యాయులు
ఇదీ చదవండి

PRC: పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగుల ఆందోళన.. ఈ నెల 20న కలెక్టరేట్ల ముట్టడిస్తామన్న యూటీఎఫ్‌

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details