ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యార్థులు, తల్లిదండ్రులతో తెదేపా యువనేతల వర్చువల్ సమావేశం - విజయవాడలో తెదేపా యువనేతల సమావేశం

పరీక్షల రద్దుపై విద్యార్థులు, తల్లిదండ్రులతో తెదేపా యువనేతలు వర్చువల్​గా సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తే.. విద్యార్థులు సూపర్ స్ప్రెడ్డర్​​లుగా మారవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

tdp youth leader virtual meet with students and parents
విద్యార్థులు, తల్లిదండ్రులతో తెదేపా యువనేతల వర్చువల్ సమావేశం

By

Published : Apr 25, 2021, 10:57 PM IST

Updated : Apr 26, 2021, 4:08 AM IST

విద్యార్థులు, తల్లిదండ్రులతో తెదేపా యువనేతల వర్చువల్ సమావేశం

కరోనా కబలిస్తుండటంతో రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు ఇప్పటికే రద్దు నిర్ణయం తీసుకున్నాయని గుర్తుచేసింది. కరోనా భయాందోళనలపై విద్యార్థులు, తల్లిదండ్రులతో తెలుగుదేశం యువ నాయకులు డిజిటల్‌ టౌన్‌హాల్‌ ద్వారా ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడితే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

కరోనా సెకండ్‌వేవ్ ఎంతో వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కొవిడ్‌ బారీనపడ్డారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలను ప్రభుత్వం మూసివేసినా....ఇంటర్‌, పదో తరగతి పరీక్షలు నిర్వహణకు మాత్రం మొగ్గుచూపుతోంది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసినా...ఇక్కడ మాత్రం నిర్వహిస్తామనడం...విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టడమేనని తెలుగుదేశం మండిపడుతోంది. ఆ పార్టీ యువ నాయకులు విద్యార్థులు, తల్లిదండ్రులతో డిజిటల్‌ టౌన్‌హాల్‌ ద్వారా ముఖాముఖి నిర్వహించి వారి ఆందోళనను అడిగి తెలుసుకున్నారు. ఎంతో కష్టపడి చదువుకున్న తమకు పరీక్షలు రాయాలని ఉన్నా....ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదన్నారు. రోజురోజుకు పెరుగుతున్న కేసుల దృష్ట్యా...పరీక్షలు పూర్తిగా రద్దు చేయాలని కోరారు.

ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తే......విద్యార్థుల ద్వారా వైరస్ మరింత విస్తరించే ప్రమాదముందని తెలుగుదేశం నేతలు గౌతు శిరీష, ఆదిరెడ్డి వాసు, కిమిడి నాగార్జున అన్నారు. పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే......విద్యార్థుల తరఫున ఉద్యమిస్తామని హెచ్చరించారు. తమ సమస్యలపై స్పందించి పోరాడుతున్న తెలుగుదేశం నేతలకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి:'పది, ఇంటర్ పరీక్షలపై సీఎం జగన్ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు'

Last Updated : Apr 26, 2021, 4:08 AM IST

ABOUT THE AUTHOR

...view details