ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP-YCP Fight: వైకాపా, తెదేపా నేతల మధ్య ఘర్షణ..ఒకరికి తీవ్ర గాయాలు - వైకాపా, తెదేపా నేతల మధ్య ఘర్షణ వార్తలు

తెదేపా కార్యకర్తపై వైకాపా నేత దాడికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం చిన్నపులిపాకలో చోటు చేసుకుంది. తెదేపా తరఫున వార్డు మెంబర్‍గా పోటీచేసినందుకే వైకాపా నేత దాడి చేశారని స్థానికులు ఆరోపించారు.

వైకాపా, తెదేపా నేతల మధ్య ఘర్షణ
వైకాపా, తెదేపా నేతల మధ్య ఘర్షణ

By

Published : Sep 5, 2021, 8:13 PM IST

వైకాపా, తెదేపా నేతల మధ్య ఘర్షణ

కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం చిన్నపులిపాకలో తెదేపా కార్యకర్తపై వైకాపా నేత దాడికి పాల్పడ్డాడు. తెదేపా నేత కాగిత శ్రీనివాసరావుపై వైకాపాకు చెందిన సర్పంచ్ శివరామకృష్ణ కర్రలతో దాడి చేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. అడ్డొచ్చిన మహిళలపై సైతం శివరామకృష్ణ దాడికి పాల్పడ్డారన్నారు. శ్రీనివాసరావు తెదేపా తరఫున వార్డు మెంబర్‍గా పోటీచేసినందుకే దాడి చేశారన్నారు. దాడి ఘటనపై తెదేపా, వైకాపా నేతలు పరస్పరం పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసుకున్నారు. దాడిలో గాయపడ్డ శ్రీనివాసరావును విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details