ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'500 మందిపై దాడులు జరిగితే..ఎంతమందికి శిక్ష పడింది'

రెండేళ్ల వైకాపా పాలనలో దాదాపు 500 మంది మహిళలపై అరాచకాలు జరిగితే ఎంతమందికి శిక్ష పడిందని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత.. ప్రభుత్వాన్ని నిలదీశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే..అమరావతిలో మహిళల రక్తం కళ్ల చూశారని మండిపడ్డారు.దిశ కేసును తొలుత ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డిపైనే నమోదు చేయాలని విమర్శించారు.

500 మంది మహిళలపై దాడులు జరిగితే..ఎంత మందికి శిక్ష పడింది
500 మంది మహిళలపై దాడులు జరిగితే..ఎంత మందికి శిక్ష పడింది

By

Published : Mar 8, 2021, 9:44 PM IST

500 మంది మహిళలపై దాడులు జరిగితే..ఎంత మందికి శిక్ష పడింది

దిశ కేసును తొలుత ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డిపైనే నమోదు చేయాలని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే..అమరావతిలో మహిళల రక్తం కళ్ల చూశారని మండిపడ్డారు. గడిచిన రెండేళ్ల వైకాపా పాలనలో దాదాపు 500 మంది మహిళలపై అరాచకాలు జరిగితే.. ఎంత మందికి శిక్ష పడిందని నిలదీశారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో "ఓ దిశ నువ్వెక్కడ?" అంటూ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు.

మహిళల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు నీచమని ఆమె ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మహిళా దినోత్సవం జరుపుకునే పరిస్థితులు లేవని దుయ్యబట్టారు. 22 నెలల్లో ఒక్క మహిళకు కూడా జగన్ న్యాయం చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగానికి చరమగీతం పాడాలన్నారు. ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వ హయాంలో హత్యకు గురైన మహిళలకు నివాళులర్పించారు.

ABOUT THE AUTHOR

...view details