కుప్పం మహిళలు దొంగ ఓటర్లను కనిపెట్టి తరిమికొట్టారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ అన్నారు. విజయవాణి పాఠశాలలో మహిళలు బసచేసిన వీడియోను ఆమె సాక్ష్యంగా ప్రదర్శించి మీడియాకు చూపారు. పుంగనూరు, తంబాళపల్లి నుంచి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేలా దొంగఓటర్లను పెద్దిరెడ్డి తీసుకొచ్చారని ఆరోపించారు. తమిళనాడు నుంచి వచ్చిన బస్సుల్ని పట్టుకున్నా వాటిని పోలీసులు సీజ్ చేయకపోవడంపై మండిపడ్డారు. విజయవాణి పాఠశాలలో బసచేసిన మహిళలు వంటవాళ్లంటూ అనుకూల మీడియాలో ప్రచారం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంటవాళ్ల వద్ద వైకాపా కండువాలు ఎందుకున్నాయని ఆమె ప్రశ్నించారు. తపాలా సేవలాగా రాష్ట్ర ఎన్నికల సంఘం పరిమితమవ్వటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. కనీసం బ్యాలెట్ బాక్సులు తారుమారు కాకుండానైనా ఎన్నికల సంఘం జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
TDP: కుప్పం మహిళలు దొంగ ఓటర్లను కనిపెట్టి తరిమారు: అనురాధ - vijayawani school
కుప్పం ఎన్నికల్లో వైకాపా అక్రమాలను మహిళలు సమర్థవంతంగా కనుగొన్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ అన్నారు. దొంగ ఓట్ల కోసం ఇతర ప్రాంతాల నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులను తీసుకొచ్చారని ఆరోపించారు.

పంచుమర్తి అనురాధ