ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'దళిత ప్రతిఘటన ర్యాలీని అడ్డుకోవడం వైకాపా పిరికిపంద చర్యకు నిదర్శనం' - tdp leaders comments

వైకాపా సర్కార్​పై తెలుగుదేశం పార్టీ నేతలు ధ్వజమెత్తారు. దళిత ప్రతిఘటన ర్యాలీని అడ్డుకోవడంపై తెదేపా మహిళా నేతలు మండిపడ్డారు. శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం వైకాపా పిరికిపంద చర్యగా వాళ్లు అభివర్ణించారు.

tdp
ప్రతిఘటన ర్యాలీని అడ్డుకోవడంపై తెదేపా నేతలు ఫైర్

By

Published : Aug 10, 2021, 5:46 PM IST

పోలీసుల అండతో దళిత ప్రతిఘటన ర్యాలీని అడ్డుకోవచ్చు కానీ.. వచ్చే ఎన్నికల్లో ఓట్ల రూపంలో వైకాపాకు వ్యతిరేకంగా జరిగే ప్రతిఘటనను రాజారెడ్డి దిగివచ్చినా అడ్డుకోలేరని తెలుగు రాష్ట్ర మహిళా అధ్యక్ష్యురాలు వంగలపూడి అనిత అన్నారు. ఎస్సీలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు జరగుతుంటే నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే వారిపై కొవిడ్ కేసులు పెడుతున్న పోలీసులకు.. వైకాపా బహిరంగ సభలకు ఆ నిబంధనలు గుర్తు రావట్లేదా అని నిలదీశారు. జగన్ రెడ్డి.. పోలీసు వ్యవస్ధను నిందితుల్ని శిక్షించడానికి కాకుండా.. తెదేపా నేతలను ఇబ్బందులు పెట్టడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.

వైకాపాది పిరికిపంద చర్య..

ఎస్సీల పట్ల జగన్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు. రెండేళ్ల వైకాపా పాలనలో ఎందరో ఎస్సీలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారని మండిపడ్డారు. తెదేపా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో దళిత ప్రతిఘటన శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం ప్రభుత్వ పిరికిపంద చర్యగా ఆమె అభివర్ణించారు. వైకాపా ప్రభుత్వంలో ఎస్సీలకు రక్షణ కరువైందని విమర్శించారు. ఎస్సీలకు ఎవరు ఎంత మేలు చేశారన్న అంశంపై చర్చలకు రావాలని వైకాపా ప్రభుత్వానికి ఆమె సవాల్‌ చేశారు.

ఇదీ చదవండి..

భూ కబ్జా కేసులో ఏడుగురు నిందితులు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details