ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'చదువులంటే.. సారా వ్యాపారమనుకుంటున్నారా.. మంత్రి గారు' - ఏపీ వార్తలు

వైకాపా ప్రభుత్వంపై తెదేపా మహిళ నేత గౌతు శిరీష ధ్వజమెత్తారు. సామాజిక న్యాయం అనే అర్హత వైకాపాకి ఉందా అని నిలదీశారు. చదువులంటే.. “సారా” వ్యాపారమనుకుంటున్నారా బొత్సా అని ప్రశ్నించారు. లిక్కర్ డాన్ చదువుల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు.

గౌతు శిరీష
గౌతు శిరీష

By

Published : Jun 18, 2022, 7:23 PM IST

చదువులంటే.. “సారా” వ్యాపారమనుకుంటున్నారా బొత్సా అని తెదేపా మహిళ నేత గౌతు శిరీష ధ్వజమెత్తారు. సామాజిక న్యాయం అనే అర్హత వైకాపాకి ఉందా అని ప్రశ్నించారు. ఉపాధ్యాయ నియామకాలు చేయకుండా విద్యాభివృద్ధి అనడం సిగ్గుచేటని మండిపడ్డారు. సారా డాన్ బొత్సకు విద్యాశాఖ ఇవ్వడమే ఆంధ్రప్రజల దౌర్భాగ్యమని శిరీష ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ డాన్ చదువుల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు.

రెండున్నర లక్షల మంది పిల్లలు ఫెయిలవ్వడం ప్రభుత్వ వైఫల్యమేనని గౌతు శిరీష ఆరోపించారు. బైజూస్ పేరుతో జగన్ రెడ్డి కొత్త నాటకం మొదలుపెట్టారని,.. బైజూస్, రంగులతో ప్రమాణాలు పెరగవని తెలుసుకోవాలన్నారు. 25వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ ఎందుకు చేయరని నిలదీశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, డిజిటల్, వర్చువల్ తరగతులు ఎత్తేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులకు ఏ అధికారాలున్నాయన్నారు. సబ్ ప్లాన్, కార్పొరేషన్ నిధుల మళ్లింపు సామాజిక న్యాయమా అని విమర్శించారు. అసైన్డ్ రైతులకు పంటల బీమా రద్దు సామాజిక న్యాయమా అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details