Anitha fired on Roja: బందిపోట్లు ఊళ్లోకి వస్తుంటే దుకాణాలు మూసేసి, ఇళ్లలో దాక్కునే ఘటనలు సినిమాల్లో చూసేవాళ్ళమని, ఇప్పుడు జగన్ ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే అదే పరిస్థితి కనిపిస్తోందని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. నారా లోకేశ్ ప్రజల మధ్య తిరుగుతున్నారన్న విషయం గుర్తించుకోవాలన్నారు. చీర ఎవరు కట్టుకోవాలో.. ఎవరికి పంపిస్తుందో.. రోజానే తేల్చుకోవాలని అనిత విమర్శించారు. రాష్ట్రంలో 800మందికి పైగా మహిళలపై అఘాయిత్యాలు జరిగితే కనీసం నోరెత్తని సీఎంకు ఏం చీర పంపిస్తావంటూ మంత్రి రోజాను అనిత ప్రశ్నించారు. మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి 800కేసుల్లో వాసిరెడ్డి పద్మ చేతకానితనం బయటపడిందని మండిపడ్డారు.
ఏ చీర ఎవరికి పంపిస్తావో నువ్వే తేల్చుకో రోజా... - TDP Anitha on women harassments in AP
Anitha fired on Roja: బందిపోట్లు ఊళ్లోకి వస్తుంటే దుకాణాలు మూసేసి, ఇళ్లలో దాక్కునే ఘటనలు సినిమాల్లో చూసేవాళ్లమని, ఇప్పుడు జగన్ ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే అదే పరిస్థితి కనిపిస్తోందని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు.
TDP woman leader Anitha