ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గాజువాక అత్యాచార ఘటనపై తెదేపా నిజనిర్థరణ కమిటీ

కృష్ణా జిల్లా గాజువాక అత్యాచార ఘటనపై తెదేపా నిజనిర్ధరణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా వంగలపూడి అనిత, పుచ్చా విజయ్ కుమార్, ఇతలపాక సుజాత, బడుమురి గోవింద్​లను నియమించినట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళావెంకట్రావ్ తెలిపారు.

tdp  Verification Committee on Gajuwaka rape incident
కళావెంకట్రావ్

By

Published : Oct 7, 2020, 3:23 PM IST

కృష్ణా జిల్లా గాజువాకలో ఎస్సీ యువతిపై అత్యాచార ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిజనిర్ధరణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులుగా వంగలపూడి అనిత, పుచ్చా విజయ్ కుమార్, ఇతలపాక సుజాత, బడుమురి గోవింద్ లను నియమించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ నివేదిక అందిస్తుందని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కళావెంకట్రావ్ తెలిపారు.

"అత్యాచార నిందితులను వైకాపా నేతలు రక్షించే యత్నం చేయటం దుర్మార్గం. ఆరాచక పాలనకు అడ్డాగా ఏపీని మార్చారు. మహిళలపై అత్యధిక దాడులు ఏపీలోనే చోటుచేసుకుంటున్నాయి." - కళా వెంకట్రావ్

ABOUT THE AUTHOR

...view details