కరోనా నిబంధనలు, ఎన్నికల నియమావళి చంద్రబాబునాయుడికి, తెదేపా వారికి మాత్రమే వర్తిస్తాయా అని వర్ల ప్రశ్నించారు. ఆదివారం తిరుపతిలో ర్యాలీ నిర్వహించిన భూమన కరుణాకర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. ఆయనకు కరోనా సోకదా..?.. చట్టాలు వర్తించవా..? అని ధ్వజమెత్తారు.
జగన్ రాక్షస క్రీడలో భాగమే చంద్రబాబు నిర్బంధం: వర్ల రామయ్య
జగన్మోహన్ రెడ్డి, డీజీపీ సవాంగ్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుట్రపన్ని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. జగన్ ఆడుతున్న కుటిల, రాక్షస క్రీడలో భాగమే రేణిగుంటలో చంద్రబాబునాయుడు నిర్బంధమని తెలిపారు.
tdp varla ramaiah comments on cm jagan