ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈ నెల 26న భారత్​ బంద్​కు తెదేపా మద్దతు - విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకంగా భారత్​ బంద్​కు తెదేపా మద్దతుి

రైతు వ్యతిరేక చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. కిసాన్ సంయుక్త మోర్చా ఈ నెల 26న భారత్ బంద్‌ నిర్వహిస్తోంది. బంద్​కు తెదేపా మద్దతు తెలిపింది. రైతు సమస్యలపై పోరాటంలో తెదేపా ఎప్పుడూ ముందుంటుందని నేతలు చెప్పారు.

tdp supports bharath bundh against steel plant privatisation and agricultural laws
ఈ నెల 26న భారత్​ బంద్​కు తెదేపా మద్దతు

By

Published : Mar 22, 2021, 4:29 PM IST

రైతు వ్యతిరేక చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. కిసాన్ సంయుక్త మోర్చా ఈ నెల 26న భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్​కు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. రైతు సంఘాల సమన్వయ కమిటీ, విశాఖ ఉక్కు పోరాట వేదిక సభ్యులు.. తెదేపా కేంద్ర కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్సీలు టి.డి.జనార్దన్, పర్చూరు అశోక్ బాబును కలిశారు.

బంద్​కు తెదేపా తరఫున మద్దతు కోరారు. రైతు సమస్యలపై పోరాటంలో తెదేపా ఎప్పుడూ ముందుంటుందని.. నేతలు వారికి స్పష్టం చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని మొదటినుంచి వ్యతిరేకిస్తున్నామని గుర్తు చేశారు. బంద్ కు మద్దతు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details