ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి' - bharat bandh at vijayawada updates

భారత్‌ బంద్‌కు మద్దతుగా.. రైతుల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్ అహ్మద్‌కు రైతుసంఘాల నేతలతో కలిసి తెలుగుదేశం నేతలు వినతిపత్రం సమర్పించారు. నూతన వ్యవసాయ బిల్లులు లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పుడే తెలుగుదేశం ఎంపీలు సవరణలు సూచించారని గద్దె రామ్మోహన్ గుర్తు చేశారు..

tdp support to bharat bandh request letter to krishna district
భారత్ బంద్​కు తెదేపా మద్దతు

By

Published : Dec 8, 2020, 1:28 PM IST

భారత్ బంద్​కు తెదేపా మద్దతు

రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్​కు తెదేపా మద్దతు ప్రకటించింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ఇంతియాజ్​కు వినతిపత్రం అందచేశారు. నిర్వీర్యం చేస్తున్న వ్యవసాయ మార్కెట్ యార్డుల వ్యవస్థను చట్టబద్ధం చేయాలని కోరారు.

రైతులకు ఇబ్బంది కలిగించే అంశాలను తెదేపా పార్లమెంట్​లోనే వ్యతిరేకించిందని నేతలు అన్నారు. కలెక్టర్​కు వినతిపత్రం అందజేసే ప్రక్రియలో కొంత గందరగోళం నెలకొంది. ఉదయం 10 గంటలకు సమయం ఇచ్చిన కలెక్టర్ తర్వాత అందుబాటులో లేరని సిబ్బంది సమాధానం ఇవ్వటంతో.. తెలుగుదేశం నేతలు నిరసనకు దిగారు. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యను అడ్డుకుని లోనికి రాకుండా గేటు వేశారు. శ్రీరాం తాతయ్య అక్కడే బైఠాయించి ఆందోళన చేశారు. అటుగా వచ్చిన కలెక్టర్ విషయం తెలుసుకుని వినతిపత్రం స్వీకరించారు.

భాజపా ప్రభుత్వం దేశమంతా వ్యతిరేకిస్తున్న చట్టాలను రద్దు చేయాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు మేలు చేసే కొత్త చట్టాలు తీసుకురావాలన్నారు.

ఇదీ చదవండి: బాధితుల రక్త నమూనాల్లో సీసం గుర్తింపు..: ఏలూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్

ABOUT THE AUTHOR

...view details