TDP Protest on Heavy Prices : ధరలు పెరుగుదలపై తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు నిరసనలు చేపట్టారు. 'ధరలు దిగిరావాలి....జగన్ దిగిపోవాలి' అంటూ కృష్ణా జిల్లా నూజివీడులో తెలుగుదేశం కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లా బాపట్లలో తెలుగుదేశం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. నాయకులు మెడలో నిత్యావసర వస్తువుల ప్యాకెట్ల దండలను ధరించి బండి పై కూరగాయలు అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి.
రాజమండ్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టారు. గ్యాస్ సిలిండర్లతో ప్రదర్శన చేశారు. రాజోలులోనూ నిరసనలు కొనసాగాయి.