Atchenna On pensions:పింఛన్‌పై ముఖ్యమంత్రి జగన్ మడమ తిప్పారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధుల ఫించన్‌ను రూ.2000 నుంచి రూ.3000 లకు పెంచుతానని తిరుపతి సభలో హామీ ఇచ్చారని.. అధికారం చేపట్టి మూడేళ్లవుతున్నా ఇప్పటికీ పెంచింది కేవలం రూ.250 మాత్రమేనని మండిపడ్డారు.
జగన్ మోసకారి మాటలతో పింఛన్‌దారులకు భారీగా నష్టం వాటిల్లిందని ధ్వజమెత్తారు. రెండున్నరేళ్లలో రూ.250 పెంచి ఒక్కొక్కరికీ రూ.23,250 ఎగనామం పెట్టారని అన్నారు. మొత్తం 54.25 లక్షల పెన్షన్‌దారులకు రూ.12,613 కోట్లు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రూ.1800 పెంచినా.. ప్రచారం చేసుకోలేదని, జగన్ రెడ్డి రూ.250 పెంచి.. రూ.20 కోట్లు ఖర్చు పెట్టి పత్రికల్లో ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.