ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు: అచ్చెన్నాయుడు - తెదేపా నేత అచ్చెన్నాయుడు తాజా వార్తలు

TDP Leader Atchannaidu on omicron cases in AP: ఒమిక్రాన్ కేసుల కట్టడిలో ఇతర రాష్ట్రాలు ముందుంటే.. వైకాపా ప్రభుత్వం మాత్రం కక్షసాధింపులో ముందంజలో ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు.

Tdp state president Kinjarapu Atchannaidu
తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

By

Published : Dec 26, 2021, 2:56 PM IST

TDP state president Atchannaidu on AP omicron cases: ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రజల ప్రాణాలకంటే.. కక్షసాధింపు చర్యలకే సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని దుయ్యబట్టారు. వ్యాక్సినేషన్​లో ఏపీ వెనకబడి ఉందని అచ్చెన్న ఆవేదన వ్యక్తంచేశారు.

Atchannaidu on omicron cases: ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు శూన్యమన్న అచెన్న.. వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని రాష్ట్రంలో ఉన్నారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చేసే మొక్కుబడి సమీక్షలతో వచ్చే ప్రయోజనం ఏంటని నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details