ముఖ్యమంత్రి జగన్ .. రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు(tdp state president Atchannaidu) ధ్వజమెత్తారు. టమాట, మిర్చి ధరలు పతనం కావడంతో.. నష్టపోతున్న అన్నదాతను తక్షణమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పంటలు సాగుచేస్తున్న రైతన్న.. కనీస గిట్టుబాటు ధర లేక అప్పుల ఊబిలోకి కూరుకుపోతుంటే సీఎం చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.
పచ్చిమిర్చి ధర కేజీ రూ. 3, టమాట కిలో రూ.5కు పడిపోవడంతో (fall down of tomato and green chilli price) రైతులకు కూలి, రవాణ ఖర్చులు కూడా రావడంలేదని వాపోయారు. పంటను రోడ్లపైనే రైతులు పారబోస్తుంటే.. సీఎంకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పత్తి కొనుగోలులోనూ రైతులకు అన్యాయం(Atchannaidu comments on farmers) జరుగుతోందన్నారు.